అత్త కొట్టిందని అల్లుడు మనస్తాపం.. చివరకు ఏం చేశాడంటే..?

దిశ, పరకాల: కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన సాదు రామాంజనేయులును అతడి అత్త కొట్టిందన్న కారణంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని దామెర ఎస్ ఐ హరిప్రియ మీడియాకు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం రామాంజనేయులు అతడి భార్య కృష్ణవేణి కి మధ్య రోజూ ఆర్థిక పరమైన విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి. అల్లుడు తన కూతురితో రోజూ గొడవ పడటం సహించలేని రేకుల మహాలక్ష్మి అల్లుడు పై చేయి చేసుకుంది. దాంతో మనస్తాపానికి గురైన […]

Update: 2021-12-22 09:38 GMT
murder
  • whatsapp icon

దిశ, పరకాల: కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన సాదు రామాంజనేయులును అతడి అత్త కొట్టిందన్న కారణంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని దామెర ఎస్ ఐ హరిప్రియ మీడియాకు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం రామాంజనేయులు అతడి భార్య కృష్ణవేణి కి మధ్య రోజూ ఆర్థిక పరమైన విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి. అల్లుడు తన కూతురితో రోజూ గొడవ పడటం సహించలేని రేకుల మహాలక్ష్మి అల్లుడు పై చేయి చేసుకుంది.

దాంతో మనస్తాపానికి గురైన రామాంజనేయులు పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తల్లి సాదు రాజ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రియ తెలియజేశారు.

Tags:    

Similar News