జర్నలిస్టుల కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం
భువనేశ్వర్: కరోనాతో మరణించిన జర్నలిస్ట్‌ల కుటుంబ సభ్యులకు ఒడిశా ప్రభుత్వం అండగా నిలిచింది. నష్టపరిహారం కింద ఆయా కుటుంబాలకు రూ. 2.25 కోట్లు మంజూరు చేసింది. కాగా కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కంటికి రూ. 15 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు సీఎం నవీన్ పట్నాయక్ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని వారి […]
భువనేశ్వర్: కరోనాతో మరణించిన జర్నలిస్ట్‌ల కుటుంబ సభ్యులకు ఒడిశా ప్రభుత్వం అండగా నిలిచింది. నష్టపరిహారం కింద ఆయా కుటుంబాలకు రూ. 2.25 కోట్లు మంజూరు చేసింది. కాగా కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కంటికి రూ. 15 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు సీఎం నవీన్ పట్నాయక్ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబాలకు జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.