దేశంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరిగింది.. ప్రకటించిన కేంద్రం

దిశ, ఏపీ బ్యూరో: దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య 42.5 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో గురువారం కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ జూలై 2019 నుంచి జూన్‌ 2020 మధ్య నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) నిర్వహించిన కార్మిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య పెరిగిందన్నారు. అదే […]

Update: 2021-12-09 08:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య 42.5 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో గురువారం కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ జూలై 2019 నుంచి జూన్‌ 2020 మధ్య నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) నిర్వహించిన కార్మిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య పెరిగిందన్నారు.

అదే కాలంలో తయారీ రంగంలో కార్మికుల సంఖ్య 12.1 శాతం నుంచి 11.2 శాతానికి తగ్గినట్లు స్పష్టం చేశారు. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తితో వలస కార్మికులు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు తరలి పోవడం, లాక్‌డౌన్‌ వలన కర్మాగారాలు తాత్కాలికంగా మూతపడటమే అందుకు కారణమని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి పేర్కొన్నారు.

Tags:    

Similar News