వ్యాక్సినేషన్ లో సరి కొత్త రికార్డ్.. ఏకంగా 4 కొట్ల డోసులు..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 4 కోట్ల డోసుల మైలు రాయి దాటింది. ఇప్పటి వరకు 4 కోట్ల45వేల 178 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వీటిలో రెండు కోట్ల 61 లక్షల 9 వేల 999 మంది మొదటి, కోటి, 39 లక్షల 35 వేల 179 మంది రెండో డోసును పొందినట్లు స్పష్టం చేశారు. మరో 6 శాతం మంది మొదటి డోసు తీసుకోవాల్సి ఉండగా, 47 శాతం మంది రెండో డోసు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 4 కోట్ల డోసుల మైలు రాయి దాటింది. ఇప్పటి వరకు 4 కోట్ల45వేల 178 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వీటిలో రెండు కోట్ల 61 లక్షల 9 వేల 999 మంది మొదటి, కోటి, 39 లక్షల 35 వేల 179 మంది రెండో డోసును పొందినట్లు స్పష్టం చేశారు. మరో 6 శాతం మంది మొదటి డోసు తీసుకోవాల్సి ఉండగా, 47 శాతం మంది రెండో డోసు పొందాల్సి ఉన్నది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా టీకా పంపిణీ నిర్వీరామంగా కొనసాగుతున్నది. కొన్ని జిల్లాల్లో ఉదయం ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు పంపిణీ జరుగుతుందని హెల్త్ఆఫీసర్లు పేర్కొన్నారు. కూలీలు, వ్యవసాయ పనులు తదితర ఉద్యోగులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటింటికీ తిరిగి డిసెంబరు 31 వరకు అర్హులందరికీ టీకాలు ఇచ్చేస్తామని వైద్యశాఖ ధీమాను వ్యక్తం చేసింది.
పక్కా ప్లాన్‌తో పంపిణీ..
దేశ వ్యాప్తంగా జనవరి 16వ తేదిన టీకా పంపిణీ షురూ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండినోళ్లు 2,77,67 వేల మంది ఉండగా, వీరికి 3500 ప్రభుత్వ, 264 ప్రైవేట్ కేంద్రాల్లో డోసులు పంపిణీ చేస్తున్నారు. దాదాపు 10 వేల మంది వ్యాక్సినేటర్లతో పాటు మరో 25 వేల మంది అదనపు సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే పంపిణీ ప్రారంభంలో టీకాల కొరత ఎక్కువగా ఉన్నందున తొలి విడత హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్, హైరిస్క్ గ్రూప్స్, ఆర్టీసీ, టీచర్స్, సింగరేణీ, ఆర్మీ, మున్సిపల్, డ్రైవర్స్ తదితర 44 విభాగాలను సూపర్ స్ప్రేడర్స్కేటగిరీలో పకడ్భందీగా పంపిణీ చేశారు. ఆ తర్వాత డోసులు ఉత్పత్తిని బట్టి క్రమంగా అందరికీ ఇవ్వడం షురూ చేశారు.
మొదటి కోటికి 165 రోజుల సమయం: డీహెచ్డా జీ శ్రీనివాసరావు
రాష్ట్రంలో మొదటి కోటి డోసులు పంపిణీకి 165 రోజుల సమయం పట్టింది. దీనిలో 86 శాతం ఫస్ట్, 14 శాతం సెకండ్ డోసు పొందారు. అదే విధంగా రెండో కోటి దాటడానికి 78 రోజులు పట్టగా, మూడో కోటికి 27 రోజులు, నాల్గవ కోటికి 38 రోజుల సమయం పట్టింది. ప్రతీ ఇంటికి సర్వే చేస్తూ టీకాలు ఇవ్వడంతో పాటు పబ్లిక్ ప్లేసేస్లలో 180 మొబైల్ టీంలతో టీకా పంపిణీ చేశాం. అర్భన్, రూరల్ ప్రాంతాల్లో విస్తృతంగా పంపిణీ చేశాం. ఆశాలు, ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలోఅద్భుతంగా పనిచేస్తున్నారు. వారందరికీ అభినందనలు.