ఢిల్లీలో పేలుడుకు మాదే బాధ్యత : జైష్ ఉల్ హింద్

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌కు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ హింద్ ప్రకటించింది. అయితే, ఈ ఉగ్రవాద సంస్థ గురించిన సమాచారం లేదు. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన పేలుడుకు తామే బాధ్యులమని టెలిగ్రామ్ యాప్‌లో కనిపించిన చెప్పుకుంటున్న ప్రకటన మాత్రమే ప్రచారమైంది. కానీ, ఆ సంస్థ గురించి ఇది వరకు విన్న దాఖలాల్లేవు. కాగా, పేలుడు సమీపంలో లభించిన ఓ లేఖలో ఇరాన్ కమాండర్ ఖాసీం సులేమని, […]

Update: 2021-01-30 12:01 GMT

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌కు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ హింద్ ప్రకటించింది. అయితే, ఈ ఉగ్రవాద సంస్థ గురించిన సమాచారం లేదు. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన పేలుడుకు తామే బాధ్యులమని టెలిగ్రామ్ యాప్‌లో కనిపించిన చెప్పుకుంటున్న ప్రకటన మాత్రమే ప్రచారమైంది. కానీ, ఆ సంస్థ గురించి ఇది వరకు విన్న దాఖలాల్లేవు. కాగా, పేలుడు సమీపంలో లభించిన ఓ లేఖలో ఇరాన్ కమాండర్ ఖాసీం సులేమని, న్యూక్లియర్ సైంటిస్టు మొహసెన్ ఫఖ్రిజదేల పేర్లున్నాయి. దీనిపై ఇజ్రాయెల్‌లో కలకలం రేగింది. 2012లో జరిగిన బ్లాస్ట్‌తో తాజా పేలుడుకు సంబంధమున్నదన్న అనుమానాలను వ్యక్తపరిచింది. ఈ పేలుడులో ఎంబసీ అధికారుల పాత్రపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆ రోజు సెలవులో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీ అధికారులు, లేదా ముందుగానే విధుల నుంచి బయటికెళ్లిన అధికారుల వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News