హై అలర్ట్: హైదరాబాద్‌కు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ఫలితంగా గంటల పాటు రోడ్లపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. నగరంలో అప్పుడప్పుడు కుండపోతగా, గంటల పాటు ముసురుగా మొదలైన వర్షం రోజంతా వదలక పోవడంతో భాగ్యనగరం తడిసిపోయింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్ పేట్, విద్యానగర్, కోఠి, అబిడ్స్, […]

Update: 2021-09-04 08:00 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ఫలితంగా గంటల పాటు రోడ్లపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. నగరంలో అప్పుడప్పుడు కుండపోతగా, గంటల పాటు ముసురుగా మొదలైన వర్షం రోజంతా వదలక పోవడంతో భాగ్యనగరం తడిసిపోయింది.

దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్ పేట్, విద్యానగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, మియాపూర్, చందానగర్, మాదాపూర్, కుత్బుల్లాపూర్, బోరబండ, రహమత్‌నగర్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, మెహదీపట్నం, పంజాగుట్ట, బేగంపేట్, రాణిగంజ్, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్, తిరుమలగిరి, తార్నాక, మెట్టుగూడ, అమీర్‌పేట్‌, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారా‌హిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. చాలా ప్రాంతాలలో మోకాలు లోతులో నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఓ వైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జాంతో వాహనదారులు పడరాని పాట్లు పడ్డారు.

వాతావరణ శాఖ..

హైదరాబాద్‌లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. సోమవారం భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదివారం కూడా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు సగటు వర్షపాతం కంటే 30 శాతం అధికంగా నమోదైందని వాతావరణ శాఖ డైరెక్టర్ వెల్లడించారు.

Tags:    

Similar News