మాస్క్ లేకుంటే కేసు.. నేటి నుంచి అమలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనను శుక్రవారం నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టులో హాజరుపర్చాలని పేర్కొంది. విపత్తు నిర్వహణ చట్టంతో పాటుగా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనను శుక్రవారం నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టులో హాజరుపర్చాలని పేర్కొంది. విపత్తు నిర్వహణ చట్టంతో పాటుగా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. శుక్రవారం నుంచి కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలిస్తూ ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాలకు సమాచారం పంపించారు. మాస్కు ధరించకుంటే ఇప్పటి వరకు రూ. 1000 జరిమానా విధిస్తుండగా… ఇక నుంచి కేసు కూడా నమోదు చేయనున్నారు.