వరాలు కు వరంగా మారిన 'వరాహం'

దిశ,పాలేరు:ఏ వ్యాపారం ప్రజలలోకి వెళ్ళాలన్నా, అమ్మకాలను విస్తృత పరచాలన్నా మార్కెటింగ్ అనేది ప్రధాన సాధనం. ఈ ప్రకటనల మీదనే అనేక వ్యాపార సంస్థలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయనేది ప్రజలకు తెలియనిదేమి కాదు. ఒక వస్తువునో, ఒక పరికరాన్నో తయారీ చేసేందుకు ఆయా కంపెనీలు పరిశోధన & అభివృద్ది కి ఖర్చు పెట్టే మొత్తం కంటే ఆ వస్తువు ను మార్కెటింగ్ కోసం ఖర్చు చేసే మొత్తం రెండింతలు ఉండటం సహజమే కదా.. ఈ […]

Update: 2021-04-12 07:17 GMT

దిశ,పాలేరు:ఏ వ్యాపారం ప్రజలలోకి వెళ్ళాలన్నా, అమ్మకాలను విస్తృత పరచాలన్నా మార్కెటింగ్ అనేది ప్రధాన సాధనం. ఈ ప్రకటనల మీదనే అనేక వ్యాపార సంస్థలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయనేది ప్రజలకు తెలియనిదేమి కాదు. ఒక వస్తువునో, ఒక పరికరాన్నో తయారీ చేసేందుకు ఆయా కంపెనీలు పరిశోధన & అభివృద్ది కి ఖర్చు పెట్టే మొత్తం కంటే ఆ వస్తువు ను మార్కెటింగ్ కోసం ఖర్చు చేసే మొత్తం రెండింతలు ఉండటం సహజమే కదా.. ఈ ఆలోచనే ఒక సామాన్య వ్యక్తికి వచ్చింది. ఆ విన్నూత ఆలోచనే అతనిని నిలిచేలా చేసింది.

నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం కు చెందిన గూడెల్లి వరాలు ఎన్నో రోజులుగా ఒక పందిని పెంచుకుంటున్నాడు. అయితే పండగ వేళ తన కొట్టం లో పెంచుకున్న పందిని మాంసం ప్రియులకోసం వధించాలనుకున్నాడు. ఎలా పడితే అలా అమ్మితే వరాలు ఏం మిగిలుతుంది అనుకున్నాడేమో రోడ్డుపై పండి ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. ఈ విషయాన్ని పదిమందికి తెలియచేయాలను కున్న వరాలు ఆ పందికి గులాలు చల్లి, తాను ముఖానికి ఆ రంగు పులుముకుని నేలకొండపల్లి -కూసుమంచి ప్రధాన రహదారిపై ప్రదర్శన కు ఉంచారు… దీంతో ఆ వారగా వచ్చిపోయే వారందరూ కూడా ఆగి ఆ వరాహాన్ని, వరాలును వింతగా చూడటం, విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేయటంతో వరాలు చేసిన ఉపాయం సఫలీకృతమైంది.

అయితే ఇదేం కొత్త విషయం కాదని, గతంలో గ్రామాలలో పండుగల సందర్భంగా తాము ప్రజలకు ఇలాంటి విషయాలను తెలిపేందుకు టమకా వేయించే వారమని, ఇప్పుడు ఇలా వినూత్నంగా చేస్తున్నామని వరాలు తెలిపాడు. ఏదిఏమైనా ఉగాది సందర్భంగా సామాన్యుడు చేసిన ఉపాయం ఆయనకు ఉపకారం చేయాలని కోరుకుందాం

Tags:    

Similar News