‘లవ్ జిహాద్’పై చట్టాన్ని తెచ్చిన యూపీ
లక్నో: లవ్ జిహాద్‌ను నిలువరిస్తూ ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా చట్టం అమల్లోకి వచ్చింది. యోగి సర్కారు తీసుకొచ్చిన అక్రమ మత మార్పిళ్ల నిషేధ ఆర్డినెన్స్ 2020ని గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదించారు. రాష్ట్రంలో బలవంతంగా, మోసపూరితంగా లేదా పెళ్లి పేరిట మతమార్పిడికి పాల్పడే చర్యలను ఈ చట్టం అడ్డుకోనుంది. యువతుల మతమార్పిడే లక్ష్యంగా జరిగే పెళ్లిళ్లకు, అక్రమ మతమార్పిళ్లకు చెక్ పెట్టే ఆర్డినెన్స్‌ను యూపీ క్యాబినెట్ ఇటీవలే ఆమోదించిన సంగతి తెలిసిందే. యువతి మతమార్పిడే లక్ష్యంగా జరిగిన పెళ్లిని […]
లక్నో: లవ్ జిహాద్‌ను నిలువరిస్తూ ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా చట్టం అమల్లోకి వచ్చింది. యోగి సర్కారు తీసుకొచ్చిన అక్రమ మత మార్పిళ్ల నిషేధ ఆర్డినెన్స్ 2020ని గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదించారు. రాష్ట్రంలో బలవంతంగా, మోసపూరితంగా లేదా పెళ్లి పేరిట మతమార్పిడికి పాల్పడే చర్యలను ఈ చట్టం అడ్డుకోనుంది. యువతుల మతమార్పిడే లక్ష్యంగా జరిగే పెళ్లిళ్లకు, అక్రమ మతమార్పిళ్లకు చెక్ పెట్టే ఆర్డినెన్స్‌ను యూపీ క్యాబినెట్ ఇటీవలే ఆమోదించిన సంగతి తెలిసిందే. యువతి మతమార్పిడే లక్ష్యంగా జరిగిన పెళ్లిని ఈ చట్టం శూన్యంగా లేదా చెల్లనిదిగా పరిగణించనుంది.