'రియల్' గా ఆదాయం ఆగింది!

దిశ, రంగారెడ్డి: ఎప్పుడూ కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రంగారెడ్డి జిల్లా రియల్ రంగానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో భూ క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ నిర్వహిస్తున్నారు. అయితే, అంతకుముందు నుంచే అతలాకుతలంగా ఉన్న రియల్ వ్యాపారం లాక్ డౌన్ తో పూర్తిగా స్తంభించిపోయింది. రియల్ వ్యాపారం తిరిగి పుంజుకునేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, […]

Update: 2020-04-23 02:25 GMT

దిశ, రంగారెడ్డి: ఎప్పుడూ కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రంగారెడ్డి జిల్లా రియల్ రంగానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో భూ క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ నిర్వహిస్తున్నారు. అయితే, అంతకుముందు నుంచే అతలాకుతలంగా ఉన్న రియల్ వ్యాపారం లాక్ డౌన్ తో పూర్తిగా స్తంభించిపోయింది. రియల్ వ్యాపారం తిరిగి పుంజుకునేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వైరస్ ప్రభావంతో ముందుకు రావడం లేదు. భూమిని కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అడ్వాన్సులు కట్టిన వారు సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో అడ్వాన్స్ నగదు వదులుకుంటున్నారు. రియల్ వ్యాపారం జోరుగా ఉన్నప్పుడు నెలకు ఒక రంగారెడ్డి జిల్లానే సుమారుగా రూ.200 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ, ఫిబ్రవరిలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కలిపి 32 వేల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌తో సుమారుగా రూ.260 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నుంచే రియల్ వ్యాపారం తగ్గుముఖం పట్టింది. మార్చిలో రెండు జిల్లాలో కలిపి 21వేల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు కేవలం రూ.162 కోట్లు వచ్చినట్లు సమాచారం. మార్చి 21 వరకే అని అధికారులు తెలిపారు. ఆ తరువాత 500 వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో గిఫ్ట్ డీడీలే అధికంగా ఉన్నట్లు సమాచారం.

తెరిచే ఉన్న కార్యాలయాలు….

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. అధికారులు, సిబ్బంది వంతులవారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 18, వికారాబాద్‌ జిల్లాలో 4 సబ్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో డీడీలు కట్టేందుకు బ్యాంకులు సైతం అందుబాటులో ఉన్నాయి. స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శానిటైజర్లు, భౌతికదూరం పాటించేలా వెసులుబాటు, మాస్కులు ధరించి రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశాలు కల్పించాయి. కానీ, ప్రజలు కరోనా భయంతో ఎవరూ ముందుకురావడం లేదు. దస్తావేజు లేఖరులు కూడా తమ దుకాణాలు మూసివేశారు. పనిదినాల్లో ఎప్పుడూ సందడిగా ఉండే సబ్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.

Tags: Rangareddy, Real Business, Registration Office, DDs, Vikarabad

Tags:    

Similar News