నాటు వైద్యుడి ఘాతుకం.. భార్య మర్మాంగానికి కుట్లు వేసి.. ఆపై..

దిశ, వెబ్‌డెస్క్ : ఓ భర్త తన భార్యపట్ల కనీవినీ ఎరగని రీతిలో వ్యవహరించాడు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. భార్యపై అనుమానంతో ఆమె మర్మాంగానికి కుట్లు వేసి అవమానీయ ఘటనకు పాల్పడ్డాడు. ఇంత అమానుషంగా ప్రవర్తించినా ఆ భార్య మాత్రం.. భర్తను ఏమి చేయవద్దని ప్రాధేయపడింది. అందరిని కంటతడి పెట్టించిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌, సంగ్రౌలీ జిల్లా, రౌలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (55) నాటు వైద్యుడిగా పని […]

Update: 2021-08-29 06:56 GMT
husband Stitches wife
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : ఓ భర్త తన భార్యపట్ల కనీవినీ ఎరగని రీతిలో వ్యవహరించాడు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. భార్యపై అనుమానంతో ఆమె మర్మాంగానికి కుట్లు వేసి అవమానీయ ఘటనకు పాల్పడ్డాడు. ఇంత అమానుషంగా ప్రవర్తించినా ఆ భార్య మాత్రం.. భర్తను ఏమి చేయవద్దని ప్రాధేయపడింది. అందరిని కంటతడి పెట్టించిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..

మధ్యప్రదేశ్‌, సంగ్రౌలీ జిల్లా, రౌలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (55) నాటు వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఆయన తన భార్య(52)పై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు. తాను లేని సమయంలో ఆమె మరొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని తరచూ అనుమానిస్తూ గొడవకు దిగేవాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా అతడి అనుమానం తీరక వేరే వాళ్లతో శృంగారంలో ఎలా పాల్గొంటావో చూస్తా అంటూ ఆమెను ఇంట్లోనే తీసుకెళ్లి మర్మాంగానికి కుట్లు వేశాడు. తీవ్ర గాయాలై రక్తస్రావం అయిన ఆమె వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఆ దారుణాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు.

ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆ ఇల్లాలు పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. భర్త పెట్టే చిత్రహింసలను వివరించి బోరున విలపించింది. పిల్లలకు పెళ్లిళ్లు అయినా కూడా తనపై అనుమానంతో వేధిస్తున్నాడని వాపోయింది. అయినా తన భర్తపై కేసు పెట్టేందుకు ఆమె ఒప్పుకోలేదు. స్టేషన్‌కు తీసుకెళ్లి బుద్ధి చెప్పి పంపించాలని పోలీసులను కోరింది. ఆమె మాటలు విన్న పోలీసులు, వైద్యులు షాక్ అయ్యారు. అన్ని చిత్రహింసలకు గురి చేస్తున్న భర్తను ఆమె ఇంకా కాపాడుకోవాలి అనుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తన భర్తకు శిక్ష పడాలని అనుకోవడం లేదని, అతడు మారితే చాలని కోరింది భార్య. అయినా పోలీసులు ఆమె భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండని వైద్యులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి :

ఇంట్లో అద్దెకి దిగి ఓనర్ కోడలితో ఎఫైర్.. గంటన్నరలో పని ముగించిన మామ

Tags:    

Similar News