భార్యను చున్నీతో ఉరివేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం అక్కలాయిగూడెంలో భార్యను హతమార్చిన కేసులో భర్తతో పాటు మరో నలుగురిని రిమాండ్ కు తరలించామని నల్లగొండ వన్ టౌన్ సీఐ నిగిడాల సురేష్ కుమార్ గురువారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెంల్లంల గ్రామానికి చెందిన జ్యోతి(29), జిల్లాకేంద్రంలోని అక్కలాయిగూడెనికి చెందిని కుడుతాల పరుశురాముడికి 14 ఏండ్ల క్రితం వివాహమయింది. వారికి పిల్లలకు లేకపోవడంతో ఓ పాపను దత్తత తీసుకుని సాదుకుంటున్నారు. అయినా […]
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం అక్కలాయిగూడెంలో భార్యను హతమార్చిన కేసులో భర్తతో పాటు మరో నలుగురిని రిమాండ్ కు తరలించామని నల్లగొండ వన్ టౌన్ సీఐ నిగిడాల సురేష్ కుమార్ గురువారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెంల్లంల గ్రామానికి చెందిన జ్యోతి(29), జిల్లాకేంద్రంలోని అక్కలాయిగూడెనికి చెందిని కుడుతాల పరుశురాముడికి 14 ఏండ్ల క్రితం వివాహమయింది.
వారికి పిల్లలకు లేకపోవడంతో ఓ పాపను దత్తత తీసుకుని సాదుకుంటున్నారు. అయినా పిల్లలు లేరనే కోపం, అదనపు కట్నం కావాలనే ఆశతో జ్యోతిని వేధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21 తేదీ సాయంత్ర పరుశురాముడు మేనత్త సందపాక సుగుణమ్మ, మామ లింగస్వామిలు వారి ఇంటికి వచ్చారు. దీంతో పరుశరాముడు చికెన్, మద్యం తీసుకువచ్చాడు.
చికెన్ వండే విషయంలో జ్యోతికి, పరుశురాముడికి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం భోజనం చేసాక మేనత్త, మామ వేరే గధిలో నిద్రిస్తుండగా, జ్యోతి, పరుశురాముడు మధ్య అదనపు కట్నం విషయంలో ఘర్షణ జరిగింది. ఆవేశం తట్టుకోలేక పరుశరాముడు జ్యోతిపై చేయిచేసుకోవడంతో కిందపడింది. ఇదే అదునుగా భావించి చున్నీతో ఉరేసి హతమార్చాడు.
ఈ విషయం పక్కరూంలో ఉన్న మేనత్తకు, ఆమె భర్తకు తెలియపరిచాడు. వారి సలహా మేరకు బైక్ నుంచి పెట్రోల్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు. ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల దర్యాప్తునుంచి తప్పించుకోలేకపోయాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఖతాల్ గూడెం వద్ద నిందితులను అరెస్టు చేశారు. హత్యకు సహకరించిన అత్తమామలు, తల్లిదండ్రులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.