కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు అగ్రహం..
దిశ, తెలంగాణ బ్యూరో : వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టింపు లేకుండా వ్యవహరించడంపైనా, చేతులు దులిపేసుకునే ధోరణి ప్రదర్శించడంపైనా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వర్షాలు, వరదల కారణంగా రైతులకు జరిగిన పంటల నష్టం, ప్రభుత్వాలు అందించాల్సిన పరిహారంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టింపు లేకుండా వ్యవహరించడంపైనా, చేతులు దులిపేసుకునే ధోరణి ప్రదర్శించడంపైనా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వర్షాలు, వరదల కారణంగా రైతులకు జరిగిన పంటల నష్టం, ప్రభుత్వాలు అందించాల్సిన పరిహారంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. విచారణకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తరఫున హాజరైన న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. వరదసాయ పంపిణీ తమ పరిధిలోకి రాదంటూ న్యాయవాది వివరించారు.
కేంద్ర హోం శాఖ పరిధిలో ఉన్నందున కౌంటర్ దాఖలు చేయడానికి ఎందుకు జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వాల్సిన అడ్వొకేట్ జనరల్ గైర్హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అప్పటికి కేంద్ర హోంశాఖ సైతం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 8వ తేదీకి వాయిదా వేసింది.