ఈటలతో అబద్దాలు చెప్పిస్తున్నారు : వివేక్

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్యాఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​తో ప్రభుత్వ పెద్దలు అబద్దాలు చెప్పిస్తున్నారని టీబీజేపీ కోర్​కమిటీ సభ్యులు వివేక్​వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ సప్లై విషయంలో తొలుత కేంద్రాన్ని మంత్రి ఈటల మెచ్చుకున్నారని, కానీ ప్రభుత్వ పెద్దల ప్రెజర్​తో ఒక్కరోజులోనే ఆయన మాటమార్చారని విమర్శించారు. ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రాన్ని పదేపదే అడిగిన రాష్ట్రానికి సరిపడేంతా ఇవ్వడం లేదని ఈటల చేసిన వ్యాఖ్యలను […]

Update: 2021-04-30 07:55 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్యాఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​తో ప్రభుత్వ పెద్దలు అబద్దాలు చెప్పిస్తున్నారని టీబీజేపీ కోర్​కమిటీ సభ్యులు వివేక్​వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ సప్లై విషయంలో తొలుత కేంద్రాన్ని మంత్రి ఈటల మెచ్చుకున్నారని, కానీ ప్రభుత్వ పెద్దల ప్రెజర్​తో ఒక్కరోజులోనే ఆయన మాటమార్చారని విమర్శించారు. ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రాన్ని పదేపదే అడిగిన రాష్ట్రానికి సరిపడేంతా ఇవ్వడం లేదని ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కరోనాను ఎలా కంట్రోల్​ చేయాలనే దానిపై ఆలోచన లేదన్నారు. కరోనాను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తోందన్నారు. రెమిడెసీవిర్,ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ ను ఆపడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శించారు. ఆసుపత్రుల్లో స్టాఫ్​లేదని,అవుట్​సోర్సింగ్,కాంట్రాక్టు ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అన్ని జిల్లా కేంద్రాలు,ఏరియా ఆసుపత్రులను 100 బెడ్స్​కు అప్​గ్రేడ్​ చేస్తామని చెప్పి మాట మార్చారన్నారు. బడ్జెట్​లోని మొత్తం నిధులను కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వినియోగించి, ప్రజారోగ్యానికి పైసలు లేకుండా చేశారని దుయ్యబట్టారు.

Tags:    

Similar News