సర్కార్ కీలక నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల నుంచి ట్రీట్‌మెంట్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేసిన 22 ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్‌ను పునరుద్దరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయా ఆసుపత్రుల కొవిడ్ లైసెన్స్‌లను పునరుద్దరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే కరోనా బాధితుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి పేషెంట్స్‌కు రీఫండ్ చేయనున్నట్టు వైద్యశాఖ పేర్కొంది. ఇటీవలే హైకోర్టు పలు పిటిషన్‌లపై విచారణ […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితుల నుంచి ట్రీట్‌మెంట్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేసిన 22 ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్‌ను పునరుద్దరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయా ఆసుపత్రుల కొవిడ్ లైసెన్స్‌లను పునరుద్దరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే కరోనా బాధితుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి పేషెంట్స్‌కు రీఫండ్ చేయనున్నట్టు వైద్యశాఖ పేర్కొంది. ఇటీవలే హైకోర్టు పలు పిటిషన్‌లపై విచారణ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్ రద్దు కాకుండా కరోనా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని ప్రభుత్వానికి సూచించింది.