ముగ్గురు పిల్లలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైనా
బీజింగ్: చైనాలో దంపతులు ఇకపై ముగ్గురు పిల్లలకూ జన్మనివ్వవచ్చని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల ఈ దేశంలో జననాల రేటు అనూహ్యంగా పడిపోవడంతో తాజా నిర్ణయం తీసుకుంది. జననాలను పెంచాలనే లక్ష్యంతో వన్ మ్యారీడ్ కపుల్స్ ముగ్గురు పిల్లలను కనే పాలసీని అనుమతించినట్టు అధికారిక జిన్హువా పత్రిక వెల్లడించింది. దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సారథ్యంలో నిర్వహించిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం చైనాలో ఇద్దరు పిల్లలనే కనాలనే విధానం అమల్లో ఉంది. […]
బీజింగ్: చైనాలో దంపతులు ఇకపై ముగ్గురు పిల్లలకూ జన్మనివ్వవచ్చని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల ఈ దేశంలో జననాల రేటు అనూహ్యంగా పడిపోవడంతో తాజా నిర్ణయం తీసుకుంది. జననాలను పెంచాలనే లక్ష్యంతో వన్ మ్యారీడ్ కపుల్స్ ముగ్గురు పిల్లలను కనే పాలసీని అనుమతించినట్టు అధికారిక జిన్హువా పత్రిక వెల్లడించింది. దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సారథ్యంలో నిర్వహించిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం చైనాలో ఇద్దరు పిల్లలనే కనాలనే విధానం అమల్లో ఉంది. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ఒక్కరే ముద్దు లేదంటే వద్దు అనే నినాదాన్ని తొలుత అమలు చేశారు.
2016లో ఈ విధానాన్ని సవరించి ఇద్దరు పిల్లలకు అనుమతినిచ్చారు. కానీ, పిల్లల పెంపకం మోయలేని ఆర్థిక భారంగా మారడంతో చైనీస్ నగరాల్లో చాలా వరకు దంపతులు సంతానం వైపు మొగ్గుచూపలేదు. దీంతో ఆశించిన స్థాయిలో జననాల రేటు కనిపించలేదు. తాజాగా, జననాలకు భరోసానిచ్చే చర్యలతో పాపులేషన్ స్ట్రక్చర్, వృద్ధ జనాభా సవాల్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి, మానవ వనరులు, ఇతర అవసరాల కోసం ముగ్గురు పిల్లల ప్రతిపాదనను తెచ్చినట్టు జిన్హువా తెలిపింది. కానీ, భరోసా చర్యలను వివరించలేదు. అలాగే, రిటైర్‌మెంట్ ఏజ్‌ను పొడిగించే ప్రతిపాదనలు చేస్తున్నట్టు పేర్కొంది. 2020లో దేశంలో పది మంది మహిళ సగటున 13 మంది పిల్లలకు జన్మనిస్తున్నట్టు డేటా వెల్లడిస్తు్న్నది.