ఆన్లైన్లో అప్రూవ్… ఆఫ్‌లైన్‌లో పెండింగ్.. రాష్ట్రంలో కొత్త పింఛన్ల తీరిది
దిశ, తెలంగాణ బ్యూరో: ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కొవడం అంటే ఇదే. రాష్ట్రంలో ఆసరా పింఛన్‌దారుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. వాటికి మంజూరు ఇచ్చినట్టే ఇచ్చి పెండింగ్ పెట్టింది. అంతేకాకుండా కొత్త పెన్షన్లన్నీ మంజూరు చేసినట్లుగా నివేదికల్లో పేర్కొంటున్నారు. హుజురాబాద్‌లో శాంక్షన్ టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్లను మొత్తం నిలిపివేశారు. కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకున్నా.. మంజూరి నిలిపివేశారు. తాజాగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కొవడం అంటే ఇదే. రాష్ట్రంలో ఆసరా పింఛన్‌దారుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. వాటికి మంజూరు ఇచ్చినట్టే ఇచ్చి పెండింగ్ పెట్టింది. అంతేకాకుండా కొత్త పెన్షన్లన్నీ మంజూరు చేసినట్లుగా నివేదికల్లో పేర్కొంటున్నారు.
హుజురాబాద్‌లో శాంక్షన్
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్లను మొత్తం నిలిపివేశారు. కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకున్నా.. మంజూరి నిలిపివేశారు. తాజాగా రెండు నెలల కిందట హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందనే కారణంగా కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులను ఇస్తున్నట్లు ప్రకటించారు. 2018 నాటికే కొత్త పెన్షన్ కోసం 4.80 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. మళ్లీ కొత్త దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నట్లు ఆన్లైన్లో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. కానీ నాలుగు రోజులు కూడా ఉండకుండానే మళ్లీ లాక్ చేశారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సెగ్మెంట్లో కొత్త దరఖాస్తులకు పెన్షన్లకు మంజూరి ఇచ్చి, ఆర్థిక శాఖ నుంచి అనుమతి సైతం జారీ చేశారు. దీంతో జూలై నుంచే వారికి పెన్షన్లు అందుతున్నాయి.
రాష్ట్రమంతా పెండింగ్
అయితే రాష్ట్రమంతటా దరఖాస్తులు తీసుకున్నారు. వీటిలో వృద్ధులు, వితంతుల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. పాత వాటిని క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించారు. వాటన్నింటికీ ఆన్లైన్లో అప్రూవ్ చేశారు. దీంతో మొత్తం 4.80 లక్షల మంది దరఖాస్తుదారులకు పెన్షన్ వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆన్లైన్లో అప్రూవ్ చేసి ఆర్థిక శాఖలో మాత్రం బ్రేక్ వేశారు. దీంతో వెబ్సైట్లో ఒక్క అప్లికేషన్ కూడా పెండింగ్ లేదని చూపిస్తోంది. కానీ ఆఫ్‌లైన్‌లో మాత్రం వాటిని నిధులు ఇవ్వలేదు. కొత్తగా పెన్షన్ మంజూరైనట్లు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే కార్యాలయాల నుంచి ఫోన్లు చేశారు. సంబంధిత మెస్సెజ్‌లను సైతం పంపించారు. అయితే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ లేకపోవడంతో వాటికి నిధులు విడుదల కాలేదు. తమకు పెన్షన్ మంజూరైందని సంబురపడి అధికారుల దగ్గరకు వెళ్తే.. పింఛన్ సొమ్ము రాలేదని తిరిగి పంపిస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే ఫైనాన్స్ క్లియరెన్స్ లేదని చెప్పుతున్నట్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇస్తారా.. ఇవ్వరా..?
అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పిన సర్కారు.. ఇచ్చినట్టే ఇచ్చి బ్రేక్ వేసింది. ఇప్పుడు కూడా హుజురాబాద్ సెగ్మెంట్‌కు విడుదల చేస్తున్నారు. కానీ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటా ఆపేశారు. కొత్త పెన్షన్లు ఇస్తరా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడుగా 57 ఏండ్లు పైబడిన వారి దరఖాస్తులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.