థ్రిల్లర్ మ్యాజిక్ ‘ది గాన్ గేమ్’

దిశ, వెబ్‌డెస్క్ : సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. బోల్డ్ అండ్ థ్రిల్లింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు లాగేస్తున్నారు మేకర్స్. అలాంటి ఒక లాక్‌డౌన్ థ్రిల్లర్ మ్యాజిక్ సిరీస్ ‘ద గాన్ గేమ్’. లాక్‌డౌన్‌లో ఆర్టిస్టులు ఎవరింట్లో వారే ఉండి షూట్ చేసుకున్న ఈ సిరీస్‌కు క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక గుజ్రాల్ ఫ్యామిలీలో జరిగిన పరిస్థితులే కథ. కుటుంబ పెద్ద రాజీవ్ […]

Update: 2020-08-30 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. బోల్డ్ అండ్ థ్రిల్లింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు లాగేస్తున్నారు మేకర్స్. అలాంటి ఒక లాక్‌డౌన్ థ్రిల్లర్ మ్యాజిక్ సిరీస్ ‘ద గాన్ గేమ్’. లాక్‌డౌన్‌లో ఆర్టిస్టులు ఎవరింట్లో వారే ఉండి షూట్ చేసుకున్న ఈ సిరీస్‌కు క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు.

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక గుజ్రాల్ ఫ్యామిలీలో జరిగిన పరిస్థితులే కథ. కుటుంబ పెద్ద రాజీవ్ ఆ టైమ్‌లో ఢిల్లీలో ఉండగా.. కుమార్తె అమర బెంగళూరులో ఉంటుంది. ఆమె ముంబైలో ఉన్న ప్రతీక్ జిందాల్‌ను లవ్ చేస్తుంది. రాజీవ్ కొడుకు సాహిల్.. తన భార్య సుహానితో కలిసి ముంబైలో ఉంటాడు. అయితే సాహిల్‌కు కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయాడని సమాచారం అందుతుంది. కానీ, తర్వాత సాహిల్ అనే పేషెంట్ ఎవరు అడ్మిట్ కాలేదని తెలుస్తుంది. ఇక ఎవరో కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని అనుకుంటున్న టైమ్‌లో సోదరికి కాల్ వస్తుంది? ఇంతకీ కాల్ చేసింది ఎవరు?

సోషల్ మీడియాకు బానిసైన సుహాని సాహిల్‌‌ను ఏం చేస్తుంది? రాజీవ్ మోసాలు ఎలా బయటపడతాయి? సాహిల్ సోదరి అమర తెలుసుకునే నిజం ఏంటి? అనేది కథ కాగా.. నాలుగు ఎపిసోడ్స్ కలిగిన సిరీస్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. సిరీస్ రివ్యూ బెస్ట్ చాయిస్ అని తెలపగా.. ఎంకరేజింగ్ రివ్యూస్‌కు థాంక్స్ చెప్తూ పోస్ట్ పెట్టింది సుహాని పాత్రలో మెప్పించిన శ్రియ.

కథాంశం ఒక రకమైన ప్రయోగమని అభిప్రాయపడిన శ్రియ.. దర్శకుడు, ఇతర నటీనటులు లేకుండా ఒంటరిగా చిత్రీకరించడం అంత సులభం కాదని చెప్పింది. అయినా కూడా సిరీస్ టీమ్ చేసిన పనికి అంతకుమించిన బహుమతి దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది. మేకింగ్ సులభంగా జరిగేందుకు ఇంట్లో అమ్మానాన్న సహకరించారన్న శ్రియ.. ప్రతీ సాంకేతిక నిపుణుడు, మూవీ యూనిట్ సభ్యుడు కీలకంగా వ్యవహరించారని చెప్పింది. ఈ సిరీస్ యూనిట్‌కు సంబంధించిన ఎవరూ కూడా పర్సనల్‌గా కలుసుకోలేదని.. వర్చువల్ మీటింగ్స్‌లోనే అన్నీ చర్చించే వారని తెలిపింది. ఈ సిరీస్‌ను ఎంచుకున్న వూట్ మీడియా, నిర్మించిన బోధి ట్రీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు థాంక్స్ చెప్పింది శ్రియ.

Tags:    

Similar News