ఎన్ఆర్ఏ ఏర్పాటు గొప్ప మలుపు
దిశ, న్యూస్బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయడం గొప్ప మలుపని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘ఇన్నోవేషన్స్ ఫర్ న్యూ నార్మల్’ అంశంపై వర్చువల్లో జరుగుతున్న అంతర్జాతీయ సెమినార్లో ఆదివారం ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఏ ద్వారా ఏటా 1.35లక్షల కేంద్ర ఉద్యోగాలు భర్తీ అవుతాయని, దాదాపు 2.5 నుంచి 3కోట్ల మంది అభ్యర్ధులు […]
దిశ, న్యూస్బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయడం గొప్ప మలుపని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘ఇన్నోవేషన్స్ ఫర్ న్యూ నార్మల్’ అంశంపై వర్చువల్లో జరుగుతున్న అంతర్జాతీయ సెమినార్లో ఆదివారం ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఏ ద్వారా ఏటా 1.35లక్షల కేంద్ర ఉద్యోగాలు భర్తీ అవుతాయని, దాదాపు 2.5 నుంచి 3కోట్ల మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యకు ఎవరూ దూరం కావద్దని, ఆ దిశగా విద్యాసంస్థలు, విద్యావేత్తలు కృషి చేయాలని తమిళిసై పిలుపునిచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది విద్యార్ధులకు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేని కారణంగా విద్యకు దూరం కావొద్దని గవర్నర్ అన్నారు. వరంగల్ (రూరల్) జిల్లా పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న ఈ సెమినార్లో కళాశాల ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐఐఎం ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు