ఆగస్టు 15న జెండా ఎగురవేసేది వీళ్లే..

దిశ, తెలంగాణ బ్యూరో : ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జిల్లాల వారీగా జెండా ఎగురవేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదిలాబాద్ ​జిల్లాకు విప్ గంప గోవర్ధన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విప్ ​రేగ కాంతారావు, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జయశంకర్​ భూపాలపల్లిలో మండలి విప్​ భానుప్రసాదరావు, జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, జోగుళాంబ గద్వాలలో మండలి విప్ ​దామోదర్​రెడ్డి, […]

Update: 2021-08-12 06:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జిల్లాల వారీగా జెండా ఎగురవేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఆదిలాబాద్ ​జిల్లాకు విప్ గంప గోవర్ధన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విప్ ​రేగ కాంతారావు, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జయశంకర్​ భూపాలపల్లిలో మండలి విప్​ భానుప్రసాదరావు, జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, జోగుళాంబ గద్వాలలో మండలి విప్ ​దామోదర్​రెడ్డి, కామారెడ్డిలో స్పీకర్​ శ్రీనివాస్​రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, కొమురం భీం ఆసిఫాబాద్‌లో విప్ ​అరికెపూడి గాంధీ, మహబూబ్​నగర్‌లో మంత్రి శ్రీనివాస్​ గౌడ్, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, మంచిర్యాలలో విప్ బాల్క సుమన్, మెదక్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్​ మల్కాజిగిరిలో మంత్రి మల్లారెడ్డి, ములుగులో మండలి విప్​ ఎంఎస్ ప్రభాకర్​రావు, నాగర్​కర్నూల్ విప్​ గువ్వల బాలరాజు, నల్గొండలో మంత్రి మహమూద్ ​అలీ, నారాయణపేటలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి, నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, పెద్దపల్లిలో సలహాదారు కేవీ రమణాచారి, రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, రంగారెడ్డిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డిలో మండలి ప్రొటెం చైర్మన్​ భూపాల్​రెడ్డి, సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు, సూర్యాపేటలో మంత్రి జగదీశ్​రెడ్డి, వికారాబాద్‌లో డిప్యూటీ స్పీకర్​ పద్మారావు, వనపర్తిలో మంత్రి నిరంజన్​రెడ్డి, వరంగల్​లో జడ్పీ చైర్​పర్సన్ ​గండ్ర జ్యోతి, హన్మకొండలో విప్​ దాస్యం వినయ్​ భాస్కర్, యాదాద్రి భువనగిరిలో విప్ గొంగిడి సునీత జెండావిష్కరణ చేయనున్నారు.

Tags:    

Similar News