తెలంగాణ నిరుద్యోగులకు గమనిక.. ఉద్యోగ ఖాళీల లెక్క తేలింది
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించేందుకు జరుగుతున్న ప్రకియ రెండు నెలలుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడంతో… శాఖల వారీగా ఖాళీలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే మొత్తం ఖాళీలు 50 వేల కంటే తక్కువే ఉన్నట్లు అన్ని శాఖల అధికారులు నివేదిక ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. మరోసారి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించేందుకు జరుగుతున్న ప్రకియ రెండు నెలలుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడంతో… శాఖల వారీగా ఖాళీలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే మొత్తం ఖాళీలు 50 వేల కంటే తక్కువే ఉన్నట్లు అన్ని శాఖల అధికారులు నివేదిక ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. మరోసారి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు 67,820 ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. పూర్తి జాబితాను ఈ నెలలో జరిగే మంత్రిమండలి సమావేశంలో సమర్పించనుంది. మంత్రివర్గం ఆమోదం అనంతరం నోటిఫికేషన్లకు ప్రభుత్వం అనుమతించే వీలుంది.