యాదాద్రిలో ఉత్సవాలు ముగిశాయి

దిశ, ఆలేరు: యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం బాలఆలయంలో స్వయంభూ మూర్తులకు, కవచ మూర్తులకు పవిత్ర మాలాధారణ కార్యక్రమాలు ముగిశాయి. మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పవిత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లంధీఘల్ లక్ష్మీ నరసింహచార్యులు, అర్చక బృందం, వేదపండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక […]

Update: 2020-07-31 04:35 GMT

దిశ, ఆలేరు: యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం బాలఆలయంలో స్వయంభూ మూర్తులకు, కవచ మూర్తులకు పవిత్ర మాలాధారణ కార్యక్రమాలు ముగిశాయి. మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పవిత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లంధీఘల్ లక్ష్మీ నరసింహచార్యులు, అర్చక బృందం, వేదపండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నరసింహ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News