లంగర్ హౌస్‌లో ఘోరం.. కుమారుడి గొంతుకోసి హతమార్చిన తండ్రి

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి కుమారుడి గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కొసరాజు ఆసుపత్రి ఎదురుగా మహ్మద్ హసీబ్(38) అనే వ్యక్తి తన భార్య నుస్రత్‌తో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన హసీబ్ […]

Update: 2021-09-17 11:27 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి కుమారుడి గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కొసరాజు ఆసుపత్రి ఎదురుగా మహ్మద్ హసీబ్(38) అనే వ్యక్తి తన భార్య నుస్రత్‌తో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన హసీబ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.

దీంతో ఉద్యోగం లేక ఇంటివద్దే ఉంటున్న హసీబ్ కొన్ని నెలలుగా మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇందుకోసం చికిత్స సైతం తీసుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం తన రెండేళ్ల కుమారుడు ఇస్మాయిల్‌ను గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ గెలిపారు. హసీబ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News