రూ. 5 లక్షలతోపాటు భార్యకు ఉద్యోగం.. పిల్లలకు రూ. 6 లక్షలు

దిశ, బెజ్జుర్: సిర్పూర్ పేపర్ మిల్లు ప్రమాదంలో మృతి చెందిన మోహన్ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అందజేశారు. కాగజ్ నగర్ మండలం అందెవెళ్లి గ్రామానికి శనివారం ఆయన వెళ్లి మోహన్ కుటుంబ సభ్యులకు ఆ చెక్కును అందజేశారు. ఈ  సందర్భంగా కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతి చెందిన మోహన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో ఉద్యోగం కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యాజమాన్యంతో చర్చలు జరిపారని.. అందుకు […]

Update: 2021-11-13 02:13 GMT

దిశ, బెజ్జుర్: సిర్పూర్ పేపర్ మిల్లు ప్రమాదంలో మృతి చెందిన మోహన్ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అందజేశారు. కాగజ్ నగర్ మండలం అందెవెళ్లి గ్రామానికి శనివారం ఆయన వెళ్లి మోహన్ కుటుంబ సభ్యులకు ఆ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతి చెందిన మోహన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో ఉద్యోగం కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యాజమాన్యంతో చర్చలు జరిపారని.. అందుకు యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మృతుడు మోహన్ ఇద్దరు కుమార్తెల పేరు మీద రూ. 6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారని ఆయన తెలిపారు. ఆయన వెంట కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, నాయకులు ఉన్నారు.

Tags:    

Similar News