మిస్టరీగానే ఆ ముగ్గురి అదృశ్యం 

దిశ, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ జిల్లా మరిపెడలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైంది. మరిపెడలోని ఓ ఇంట్లో పూల్ సింగ్, సరిత దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అద్దెకి ఉంటున్నారు. మూడు రోజులుగా ఇద్దరు పిల్లలు, సరిత కనిపించకుండాపోయారు. వారి అదృశ్యంపై భర్త పూల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. ఎవరైనా అపహరించారా? ఏదైనా ప్రాణనష్టం జరిగిందా? అనే అనుమానాలతో కలవరపడుతున్నారు. పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తూ… గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ వారి ఆచూకీ మిస్టరీగానే ఉంది.

Update: 2020-09-14 21:20 GMT

దిశ, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ జిల్లా మరిపెడలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైంది. మరిపెడలోని ఓ ఇంట్లో పూల్ సింగ్, సరిత దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అద్దెకి ఉంటున్నారు. మూడు రోజులుగా ఇద్దరు పిల్లలు, సరిత కనిపించకుండాపోయారు.

వారి అదృశ్యంపై భర్త పూల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. ఎవరైనా అపహరించారా? ఏదైనా ప్రాణనష్టం జరిగిందా? అనే అనుమానాలతో కలవరపడుతున్నారు. పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తూ… గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ వారి ఆచూకీ మిస్టరీగానే ఉంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..