టీడీపీకి షాక్.. ఆ నేతకు 14 రోజుల రిమాండ్
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ చంద్రబాబు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ పిలుపులో భాగంగా టీడీపీ కార్యాలయానికి వెళ్లేందుకు నాదెండ్ల బ్రహ్మం ప్రయత్నించారు. తాడేపల్లి నుంచి పేరిచర్ల వైపు వెళ్తుండగా నాదెండ్ల బ్రహ్మంతోపాటు కంభంపాటి శిరీష, వేగుంట రాణి, పాలడుగు వినీల, ఆశాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళా నేతలను వదిలేసిన పోలీసులు […]
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ చంద్రబాబు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ పిలుపులో భాగంగా టీడీపీ కార్యాలయానికి వెళ్లేందుకు నాదెండ్ల బ్రహ్మం ప్రయత్నించారు. తాడేపల్లి నుంచి పేరిచర్ల వైపు వెళ్తుండగా నాదెండ్ల బ్రహ్మంతోపాటు కంభంపాటి శిరీష, వేగుంట రాణి, పాలడుగు వినీల, ఆశాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే మహిళా నేతలను వదిలేసిన పోలీసులు నాదెండ్ల బ్రహ్మంను మాత్రం విడిచిపెట్టలేదు. నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని.. నాదెండ్ల బ్రహ్మానికి ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయం నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా బ్రహ్మంకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.