కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వారిని దుకాణాల్లో అనుమతించ వద్దు : దుబ్బాక మున్సిపల్ కమిషనర్
దిశ, దుబ్బాక: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వినియోగదారులను దుకాణంలోకి అనుమతించవద్దని దుబ్బాక పుర కమిషనర్ గణేష్ రెడ్డి దుకాణదారులను కోరారు. బుధవారం దుబ్బాక పురపాలక కార్యాలయంలో వర్తక, వాణిజ్య, వ్యాపారులతో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. తీసుకొని వారికి బుధవారం దుబ్బాక బస్టాండ్ ఆవరణలో వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా […]
దిశ, దుబ్బాక: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వినియోగదారులను దుకాణంలోకి అనుమతించవద్దని దుబ్బాక పుర కమిషనర్ గణేష్ రెడ్డి దుకాణదారులను కోరారు. బుధవారం దుబ్బాక పురపాలక కార్యాలయంలో వర్తక, వాణిజ్య, వ్యాపారులతో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. తీసుకొని వారికి బుధవారం దుబ్బాక బస్టాండ్ ఆవరణలో వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో కరోనా వేరియంట్లు అయినా ఓమిక్రాన్ లాంటి వైరస్‌ల నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు, తమ చుట్టూ ఉన్న వాళ్లను కూడా కాపాడిన వారవుతారని అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలు, వివిధ రకాల దుకాణాదారులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్లాస్టిక్ కవర్లను అమ్మిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 75 మైక్రాన్ల కంటే ఎక్కువ బరువున్న కవర్లను డిసెంబర్ 31 వరకు మాత్రమే వినియోగించాలని, 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం బరువున్న ప్లాస్టిక్ కవర్లను వాడే దుకాణాదారులు పై, కొనుగోలుదారుల పై 25 వేల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం దుబ్బాక పట్టణంలో రెండు పడక గదుల ఇళ్ల వద్ద నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.