‘కమిషనర్ ఉద్యోగం పక్కన పెట్టి రాజకీయం చేస్తుండు’

దిశ, తాండూర్ : తాండూర్ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నాడని, ఆయన వచ్చాకే డీజిల్ ఖర్చులు పెరిగాయని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, చైర్ పర్సన్ భర్త పరిమళ్ ఆరోపించారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. శానిటరీ ఇన్ స్పెక్టర్ కావాలనే నిందలు వేస్తున్నాడని నేను ఎలాంటి బెదిరింపులకు పాల్పడ లేదని, పురపాలక సంఘంలో నడుస్తున్న అక్రమాల గురించి అడిగినందుకే వాళ్ల బండారం బయటపడుతుందని మాపై నిందలు మోపుతున్నారని వారు పేర్కొన్నారు. […]

Update: 2021-09-25 08:41 GMT

దిశ, తాండూర్ : తాండూర్ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నాడని, ఆయన వచ్చాకే డీజిల్ ఖర్చులు పెరిగాయని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, చైర్ పర్సన్ భర్త పరిమళ్ ఆరోపించారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. శానిటరీ ఇన్ స్పెక్టర్ కావాలనే నిందలు వేస్తున్నాడని నేను ఎలాంటి బెదిరింపులకు పాల్పడ లేదని, పురపాలక సంఘంలో నడుస్తున్న అక్రమాల గురించి అడిగినందుకే వాళ్ల బండారం బయటపడుతుందని మాపై నిందలు మోపుతున్నారని వారు పేర్కొన్నారు.

ఆర్డీవో అశోక్ కుమార్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చేపడుతూ ఉద్యోగం పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నాడని డీజిల్ ఖర్చు ఎలా పెరిగాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇవన్నీ అధికారులు ప్రతిపక్షాలు కలిసి ఆడుతున్న నాటకమని, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను బెదిరించి మాపై నిందలు మోపుతున్నారని ఓ మహిళా కార్మికురాలు మాట్లాడిన రికార్డింగ్ వాయిస్ ను వారు మీడియా సమక్షంలో వినిపించారు.

Tags:    

Similar News