కంటైన్‌మెంట్ ఏరియాల్లో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

దిశ నల్గొండ: కరోనా నివారణ నేపథ్యంలో గుర్తించిన కంటైన్‌మెంట్ ప్రాంతాల ప్రజలు ఇంటికే పరిమితం కావాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆయా ఏరియాల్లో కాలి నడకన తిరిగి వైద్య పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. ఇంటి వద్దకే కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరా జరుగుతుందా లేదా అని తెలుసుకున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ఇంటి కుటుంబ సభ్యులతో కలెక్టర్ […]

Update: 2020-04-13 08:30 GMT

దిశ నల్గొండ: కరోనా నివారణ నేపథ్యంలో గుర్తించిన కంటైన్‌మెంట్ ప్రాంతాల ప్రజలు ఇంటికే పరిమితం కావాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆయా ఏరియాల్లో కాలి నడకన తిరిగి వైద్య పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. ఇంటి వద్దకే కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరా జరుగుతుందా లేదా అని తెలుసుకున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ఇంటి కుటుంబ సభ్యులతో కలెక్టర్ మాట్లాడారు. వారి వైద్య పరీక్షలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో బాధిత కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కోరారు.

tag: Collector prashanth jeevan patil, visit, Containment Areas, nalgonda

Tags:    

Similar News