ఆ ప్రాజెక్టుపై పటిష్టమైన బందోబస్తు

దిశ, గజ్వేల్: కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రాంతంలో రోజురోజుకూ సందర్శకుల తాకిడి అధికం అవుతుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. గురువారం మర్కుక్ పంప్ హౌస్‌లో కలెక్టర్, పోలీసు కమిషనర్ రెండు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. కొండపోచమ్మ సాగర్ కట్టపై సందర్శకుల తాకిడి పెరగడంతో, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి శనివారం, ఆదివారం, పండుగ […]

Update: 2020-08-27 09:02 GMT

దిశ, గజ్వేల్: కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రాంతంలో రోజురోజుకూ సందర్శకుల తాకిడి అధికం అవుతుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. గురువారం మర్కుక్ పంప్ హౌస్‌లో కలెక్టర్, పోలీసు కమిషనర్ రెండు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

కొండపోచమ్మ సాగర్ కట్టపై సందర్శకుల తాకిడి పెరగడంతో, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి శనివారం, ఆదివారం, పండుగ రోజుల్లో ప్రత్యేక బందోబస్తు ఉండేలా వ్యూహ రచనలు చేశారు.

Tags:    

Similar News