‘ఉదయసముద్రం ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయండి’
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల గ్రామాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కారణంగా నకిరేకల్, మునుగోడు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం పేర్కొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల గ్రామాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కారణంగా నకిరేకల్, మునుగోడు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం పేర్కొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉదయసముద్రం ప్రాజెక్టు సత్వరం పూర్తికావడానికి వీలుగా భూ సేకరణ జరపాలని, టన్నెల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. పిలాయపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు కూడా దీనితో పాటే పూర్తి చేయడానికి వీలుగా చర్యలను చేపట్టాలని స్పష్టం చేశారు.