ఘరానా మోసం.. నమ్మిన చోటే ముంచేసిన మహిళ

దిశ,కోదాడ: కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం పక్కన గల చక్రపాణి బట్టల దుకాణంలో గత నెల 29వ తేదీన చోరీ జరిగింది.ఈ ఘటనలో 35 తులాల బంగారం, రెండు లక్షల రూపాయల నగదు మాయమయ్యాయి. కాగా దుకాణ యజమాని ఫిర్యాదుమేరకు కోదాడ పట్టణ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో దుకాణంలో పనిచేసే పట్టణానికి సమీపంలోని రామిరెడ్డి పాలెంకి చెందిన గౌసియా బేగం ఈ చోరీ చేసినట్లు గుర్తించి సదరు మహిళను అరెస్టు చేసారు. […]

Update: 2021-10-04 06:52 GMT

దిశ,కోదాడ: కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం పక్కన గల చక్రపాణి బట్టల దుకాణంలో గత నెల 29వ తేదీన చోరీ జరిగింది.ఈ ఘటనలో 35 తులాల బంగారం, రెండు లక్షల రూపాయల నగదు మాయమయ్యాయి. కాగా దుకాణ యజమాని ఫిర్యాదుమేరకు కోదాడ పట్టణ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో దుకాణంలో పనిచేసే పట్టణానికి సమీపంలోని రామిరెడ్డి పాలెంకి చెందిన గౌసియా బేగం ఈ చోరీ చేసినట్లు గుర్తించి సదరు మహిళను అరెస్టు చేసారు. ఈ మేరకు కోదాడ పట్టణ సీఐ నరసింహారావు సోమవారం విలేకరుల సమావేశంలో దొంగతనం వివరాలను వెల్లడించారు. గత రెండు నెలలుగా వస్త్ర దుకాణంలో హైదరాబాద్ నుండి వచ్చిన మహిళ గౌసియా బేగం గుమస్తాగా చేరింది. యజమానితో మంచిగా ఉంటూ నమ్మకం కలిగేలా ఉండి వస్త్రవ్యాపారి దుకాణంలో పై అంతస్తులో లాకర్ లో దాచిన బంగారం డబ్బులు పై కన్నువేసింది. లాకర్ తాళాలు దుకాణంలోని క్యాష్ కౌంటర్ నుండి చాకచక్యంగా తీసుకొని పై అంతస్తుకి వెళ్లి బంగారు ఆభరణాలు, నగదు సంచిలో వేసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్ళిపోయింది.

దుకాణ యజమాని పైకి వెళ్లి లాకర్ చూడగానే చోరీ జరిగినట్లు గమనించాడు. గుమాస్తా గౌసియా కు ఫోన్ చేయగా తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని అందుకే షాప్ కి రావడం లేదని చెప్పింది. అనుమానం వచ్చిన షాపు యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తులో గౌసియా బేగం నేరం చేసినట్లు ఒప్పుకుంది. దర్యాప్తులో రామిరెడ్డి పాలెం లోని తన నివాసంలో దాచి పెట్టిన 35 తులాల బంగారు ఆభరణాలు నాలుగు లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా పరిష్కరించిన సిఐ నరసింహారావు, ఎస్సైరాంబాబు, ఏఎన్ఏ సైదా, సిబ్బందిని డీఎస్పి రఘు, ఎస్పీ భాస్కరన్ అభినందించారు.

Tags:    

Similar News