‘జీనియస్’ పోటీలకు హైదరాబాద్ చిన్నారులు

దిశ, కుత్బుల్లాపూర్: హైదరాబాద్ కు చెందిన చిన్నారులు అరుదైన ఘనత సాధించారు. వీరంతా పదేండ్ల లోపు వారు కావడం విశేషం. నగరంలో ఎస్ఐపీ నిర్వహించిన జాతీయస్థాయి అరిథ్మెటిక్ జీనియస్ పరీక్షలకు 5 వేల మంది విద్యార్థులు పోటీ పడగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కర్రి క్రాంతి మనస్వి, ఆశ్రిత, సరయు ఎరుకుల్లా, చిరాగ్ మొహంతి, అన్విత, చాపా, డి.సౌరవ్, సత్యహాసిని(తిరుపతి), నూతన్ భార్గవ్ మండలా, కె.అక్షిత ప్రతిభకనబర్చారు. తొమ్మిది మంది చిన్నారులు ఫిబ్రవరి 21వ తేదీన […]

Update: 2021-02-15 13:07 GMT

దిశ, కుత్బుల్లాపూర్: హైదరాబాద్ కు చెందిన చిన్నారులు అరుదైన ఘనత సాధించారు. వీరంతా పదేండ్ల లోపు వారు కావడం విశేషం. నగరంలో ఎస్ఐపీ నిర్వహించిన జాతీయస్థాయి అరిథ్మెటిక్ జీనియస్ పరీక్షలకు 5 వేల మంది విద్యార్థులు పోటీ పడగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కర్రి క్రాంతి మనస్వి, ఆశ్రిత, సరయు ఎరుకుల్లా, చిరాగ్ మొహంతి, అన్విత, చాపా, డి.సౌరవ్, సత్యహాసిని(తిరుపతి), నూతన్ భార్గవ్ మండలా, కె.అక్షిత ప్రతిభకనబర్చారు. తొమ్మిది మంది చిన్నారులు ఫిబ్రవరి 21వ తేదీన ఆన్ లైన్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్ఐపీ రీజనల్ హెడ్ ఉమావిశ్వనాథన్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గతేడాది అక్టోబర్ నుంచి జనవరి చివరి వరకు జరిగిన పోటీల్లో అంకగణిత మేధావి, ఆల్ ఇండియా ఆన్లైన్ పోటీ 2020 ప్రాంతీయ స్థాయిలో ప్రతిభ చూపారన్నారు. క్రాంతి మనస్వి, ఆశ్రిత, సరయు ఎరుకుల్లా ప్రాంతీయ స్థాయిలో ఛాంపియన్ గా నిలిచారని తెలిపారు. 5 వేల మది పోటీ పడగా వెయ్యి మందిని షార్ట్ లిస్ట్ చేయగా తొమ్మిది మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News