ధాన్యం ద‌ళారుల‌కు అమ్ముకోవ‌ద్దు : మంత్రి జగదీశ్‌రెడ్డి

దిశ, న‌ల్లగొండ‌: ధాన్యాన్ని ద‌ళారుల‌కు అమ్ముకొని రైతులు మోస‌పోవ‌ద్ద‌ని నాణ్య‌మైన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల‌కు తీసుకొచ్చి మ‌ద్ద‌తు ధ‌ర పొందాల‌ని రాష్ట్ర మంత్రి గుంటండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. సూర్య‌పేట మండ‌లం చివ్వెంల వ‌ద్ద ఉన్న ధాన్యం కొనుగోలు ఐకేపీ కేంద్రాన్ని మంత్రి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో క‌ల్లాల వ‌ద్ద‌కు సైతం వ‌చ్చి ప్ర‌భుత్వ అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తార‌ని చెప్పారు. ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక దిగుబ‌డులు […]

Update: 2020-04-08 01:23 GMT

దిశ, న‌ల్లగొండ‌: ధాన్యాన్ని ద‌ళారుల‌కు అమ్ముకొని రైతులు మోస‌పోవ‌ద్ద‌ని నాణ్య‌మైన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల‌కు తీసుకొచ్చి మ‌ద్ద‌తు ధ‌ర పొందాల‌ని రాష్ట్ర మంత్రి గుంటండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. సూర్య‌పేట మండ‌లం చివ్వెంల వ‌ద్ద ఉన్న ధాన్యం కొనుగోలు ఐకేపీ కేంద్రాన్ని మంత్రి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో క‌ల్లాల వ‌ద్ద‌కు సైతం వ‌చ్చి ప్ర‌భుత్వ అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తార‌ని చెప్పారు. ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక దిగుబ‌డులు వ‌చ్చినందున కొనుగోళ్ల ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ద‌ళారుల‌కు అమ్ముకొని మోస‌పోవ‌ద్ద‌ని రైతుల‌కు చెప్పారు. సూర్య‌పేట‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ చేస్తోన్న క్ర‌మంలో భౌతిక దూరం పాటించాల‌ని కోరారు. మాస్క్‌లు క‌చ్చితంగా పెట్టుకోవాల‌ని సూచించారు. మంత్రి వెంట రాజ్య‌స‌భ స‌భ్యులు బ‌డుగుల లింగ‌య్య‌యాద‌వ్‌, స్థానిక మున్సిపల్ చైర్ ప‌ర్సన్ అన్న‌పూర్ణ త‌దిత‌రులు ఉన్నారు.

Tags: Grain buying center, suryapet, opened, Minister Jagadish Reddy, nalgonda

Tags:    

Similar News