దేశంలో థర్డ్ వేవ్.. కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దేశమంతా అల్లాడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. దేశంలో థర్డ్ వేవ్ తప్పదని.. అది అనివార్యమని హెచ్చరించింది. ఈ మేరకు సెంట్రల్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె.విజయరాఘవన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘వైరస్ సంక్రమణ చాలా వేగంగా ఉంది. కరోనా మూడో దశ అనివార్యం. కానీ ఏ సమయంలో ఇది విరుచుకుపడుతుందో స్పష్టత లేదు. మనం రాబోయే దశల (వేవ్స్)కు సిద్ధంగా ఉండాలి’ అని ఆయన తెలిపారు. […]

Update: 2021-05-05 07:34 GMT

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దేశమంతా అల్లాడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. దేశంలో థర్డ్ వేవ్ తప్పదని.. అది అనివార్యమని హెచ్చరించింది. ఈ మేరకు సెంట్రల్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె.విజయరాఘవన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘వైరస్ సంక్రమణ చాలా వేగంగా ఉంది. కరోనా మూడో దశ అనివార్యం. కానీ ఏ సమయంలో ఇది విరుచుకుపడుతుందో స్పష్టత లేదు. మనం రాబోయే దశల (వేవ్స్)కు సిద్ధంగా ఉండాలి’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్న రాఘవన్.. రోగ నిరోధక వ్యవస్థను తగ్గించి, వ్యాధి తీవ్రతను పెంచే వేరియంట్లు రాబోతున్నాయని హెచ్చరించారు.

Tags:    

Similar News