5జీ నెట్‌వర్క్‌లో ఆ రెండు సంస్థలు వద్దు
దిశ, వెబ్‌డెస్క్: భద్రతా కారణాల దృష్ట్యా హువాయ్, జెడ్‌టీఈలను 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వొద్దని భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) కేంద్రాన్ని అభ్యర్థించింది. భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇండియాలో చేపట్టబోయే 5జీ నెట్‌వర్క్ ప్రక్రియల్లో ఈ రెండు సంస్థలు పాల్గొనకూడదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సీఏఐటీ లేఖ రాసింది. ఈ కంపెనీలపై అంతర్జాతీయ గూఢచర్యం, కుట్ర, మనీ లాండరింగ్ లాంటి నేరారోపణలు నమోదైనట్టు లేఖలో స్పష్టం చేసింది. చైనా యాప్‌లతో పాటు హైవే, మెట్రో, […]
దిశ, వెబ్‌డెస్క్: భద్రతా కారణాల దృష్ట్యా హువాయ్, జెడ్‌టీఈలను 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వొద్దని భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) కేంద్రాన్ని అభ్యర్థించింది. భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇండియాలో చేపట్టబోయే 5జీ నెట్‌వర్క్ ప్రక్రియల్లో ఈ రెండు సంస్థలు పాల్గొనకూడదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సీఏఐటీ లేఖ రాసింది. ఈ కంపెనీలపై అంతర్జాతీయ గూఢచర్యం, కుట్ర, మనీ లాండరింగ్ లాంటి నేరారోపణలు నమోదైనట్టు లేఖలో స్పష్టం చేసింది. చైనా యాప్‌లతో పాటు హైవే, మెట్రో, రైల్వే కాంట్రాక్టులను రద్దు చర్యలపై సీఏఐటీ ప్రెసిడెంట్ భార్టియా సంతోషం వ్యక్తం చేశారు. తాము చేపట్టిన బాయ్‌కాట్ చైనా ప్రచారానికి అనుగుణంగా కేంద్రం తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఈ క్రమంలోనే, ఇండియాలో త్వరలో చేపట్టే 5జీ నెట్‌వర్క్ ప్రక్రియల్లో హువావే, జెడ్‌టీఈ కార్పొరేషన్‌లు పాల్గొనకుండా నిషేధం విధించాలని భార్టియా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఈ రెండు కంపెనీలతో యూఎస్, సింగపూర్, లండన్ దేశాలు భాగస్వామ్యాన్ని వదులుకున్నట్లు ఆయన గుర్తు చేశారు.