వధువును చూసి నోరెల్లబెట్టిన బంధువులు.. వరుడు షాక్
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లంటే ఏడు రోజుల పండగ. సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం. రెండు కుటుంబాల మధ్య కొత్త బంధుత్వాన్ని కలుపుకునే తంతు. ముఖ్యంగా ఆచారాలకు, కట్టుబాట్లకు పెద్దపీఠ వేస్తారు ఈ పెళ్లి వేడుకల్లో. అయితే ఓ పెళ్లి కూతురు ఆచారాలు, కట్టుబాట్లను ఆచరిస్తూనే కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఆమె తీరును చూసి బంధుగణంతోపాటు పెళ్లి కుమారుడు సైతం నోరెళ్లబెట్టాడు. ఇంతకు ఆమె చేసిందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ కథనం చదవండి. మహారాష్ట్రకు చెందిన […]
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లంటే ఏడు రోజుల పండగ. సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం. రెండు కుటుంబాల మధ్య కొత్త బంధుత్వాన్ని కలుపుకునే తంతు. ముఖ్యంగా ఆచారాలకు, కట్టుబాట్లకు పెద్దపీఠ వేస్తారు ఈ పెళ్లి వేడుకల్లో. అయితే ఓ పెళ్లి కూతురు ఆచారాలు, కట్టుబాట్లను ఆచరిస్తూనే కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఆమె తీరును చూసి బంధుగణంతోపాటు పెళ్లి కుమారుడు సైతం నోరెళ్లబెట్టాడు. ఇంతకు ఆమె చేసిందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ కథనం చదవండి.
మహారాష్ట్రకు చెందిన యువతి.. మరాఠి సంప్రాదాయం ప్రకారం ముస్తాబు అయింది. చీరకట్టు.. ఆభరణాలు ధరించి.. కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టి సన్నీలియోన్ నర్తించిన ‘మేరే సైయాన్’సాంగ్ కు ఇరగదీసే స్టెప్పులేసింది. డ్యాన్స్ చేస్తూనే పెళ్లి వేధిక వద్దకు వెళ్లి వరుడికి ముద్దిచ్చింది. ఈ తంతునంతా చూసిన బంధువులు మొదట నోరెళ్లబెట్టినా.. తర్వాత ఆమెను ఎంకరేజ్ చేశారు. వారి ఫోన్లలో ఎగబడి మరీ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
आवडलेलं ❤️ pic.twitter.com/AeziuDdiu6
— Praveen Gavit (@praveengavit10) December 2, 2020