పాల ప్యాకెట్ కోసం వెళ్లిన బాలుడు..
దిశ, చార్మినార్ : పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి వెళ్లిన బాలుడు అనుమానస్పద స్థితిలో అదృశ్యమయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట ఎస్ఐ గోవర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట మహ్మద్నగర్కు చెందిన షేక్ సమీర్ వృత్తి రిత్యా లేబర్. ఇతనికి ఆరుగురు సంతానం. ముగ్గరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు షేక్ అఖిల్(13), 24 వ తేదీన స్థానిక కిరాణా దుకాణానికి పాల ప్యాకెట్ కోసమని […]
దిశ, చార్మినార్ : పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి వెళ్లిన బాలుడు అనుమానస్పద స్థితిలో అదృశ్యమయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట ఎస్ఐ గోవర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట మహ్మద్నగర్కు చెందిన షేక్ సమీర్ వృత్తి రిత్యా లేబర్. ఇతనికి ఆరుగురు సంతానం. ముగ్గరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు షేక్ అఖిల్(13), 24 వ తేదీన స్థానిక కిరాణా దుకాణానికి పాల ప్యాకెట్ కోసమని వెళ్లాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. షేక్ అఖిల్ ఆచూకి కోసం బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో ఈ నెల 25వ తేదీన తండ్రి షేక్ సమీర్ చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.