మోనాల్ ప్రేమ.. వ్యతిరేకించిన బీజేపీ నేత
దిశ, వెబ్డెస్క్: తనను, తన కుటుంబం నుంచి కాపాడాలని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమించిన వాడిని పెళ్లాడిన ఆమె తన తండ్రి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఇందులో విశేషం ఏముంది.. అంటే ఆ యువతి ఒక ప్రముఖ బీజేపీ నేత కుమార్తె కావడం. ఈ ఘటన కర్ణాటక లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. హుబ్లీ బీజేపీ కీలక నేత కుమార్తె మోనల్ కొరవి గత […]
దిశ, వెబ్డెస్క్: తనను, తన కుటుంబం నుంచి కాపాడాలని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమించిన వాడిని పెళ్లాడిన ఆమె తన తండ్రి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఇందులో విశేషం ఏముంది.. అంటే ఆ యువతి ఒక ప్రముఖ బీజేపీ నేత కుమార్తె కావడం. ఈ ఘటన కర్ణాటక లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. హుబ్లీ బీజేపీ కీలక నేత కుమార్తె మోనల్ కొరవి గత కొంత కాలంగా రాహుల్ చందావరకర అనే యువకుడిని ప్రేమించింది. అయితే అతను వేరే కులానికి చెందిన వాడు కావడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్ళికి నిరాకరించారు. దీంతో మోనాల్ ఈనెల 2న గదగ్ జిల్లా ముండ్రగిలో ఇంటి నుంచి వెళ్ళిపోయి రిజిష్టర్ వివాహం చేసుకుంది. ఇక కుమార్తె తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన బీజేపీ నేత ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మోనాల్ పోలీసులను ఆశ్రయించింది. కమిషనర్ లాబురామ్ను కలిసి తన తండ్రి వలన తనకు ప్రాణ హాని ఉందని, తనను, తన భర్తను చంపడానికి చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.