అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ హిందూముస్లింల సమస్య కాదనీ, దేశ ప్రజలందరి సమస్యని తెలిపారు. సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలను గుడ్డిగా వ్యతిరేకించట్లేదనీ, బలమైన కారణంతోనే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లును పున:సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. దేశం […]

Update: 2020-03-16 00:52 GMT

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ హిందూముస్లింల సమస్య కాదనీ, దేశ ప్రజలందరి సమస్యని తెలిపారు. సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలను గుడ్డిగా వ్యతిరేకించట్లేదనీ, బలమైన కారణంతోనే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లును పున:సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. దేశం మంచి వైపు నడవాలని ఆకాంక్షించారు.

Tags: caa, nrc, npr, telangana assembly, anti caa resolution, kcr, trs,

Tags:    

Similar News