మూడు రాజధానులపై విచారణ వాయిదా

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజధాని కేసుల విచారణను హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. జనవరి 28 కు విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో సోమవారం రాజధాని కేసుల విచారణ జరిగింది. ఈ  సందర్భంగా విచారణను జనవరి 31కి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం సీఆర్‌డీఏ […]

Update: 2021-12-27 06:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజధాని కేసుల విచారణను హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. జనవరి 28 కు విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో సోమవారం రాజధాని కేసుల విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణను జనవరి 31కి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

అయితే పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటిషన్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను 10 రోజుల్లోగా నోట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ల తరఫు న్యాయవాదులను ఆదేశించింది. అలాగే రైతుల దాఖలు చేసే నోట్‌పై స్పందన తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రభుత్వం తరఫున అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం రాజధాని కేసుల విచారణను హైకోర్టు జనవరి 28కి వాయిదా వేసింది. జనవరి 28న ఈ కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News