సంచలన తీర్పు.. ఇచ్చిన థానే కోర్టు.. సీనియర్ రచయితకు ఒక్క రూపాయి జరిమానా

దిశ, సినిమా: బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్‌కు థానే కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్‌ఎస్ఎస్‌ను తాలిబాన్లతో పోల్చినందుకుగాను తనకు వ్యతిరేకంగా పరువునష్టం దావా కేసు వేశారు ఆర్‌ఎస్ఎస్ యాక్టివిస్ట్ వివేక్ చంపానేర్కర్. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, జాయింట్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో సూట్ ఫైల్ చేసిన వివేక్.. జనం ముందు ఆర్‌ఎస్ఎస్ ఇమేజ్‌ను చెడగొట్టడమే లక్ష్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇందుకుగాను జావెద్ రూ.1 జరిమానా కింద చెల్లించాలని […]

Update: 2021-09-29 05:24 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్‌కు థానే కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్‌ఎస్ఎస్‌ను తాలిబాన్లతో పోల్చినందుకుగాను తనకు వ్యతిరేకంగా పరువునష్టం దావా కేసు వేశారు ఆర్‌ఎస్ఎస్ యాక్టివిస్ట్ వివేక్ చంపానేర్కర్. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, జాయింట్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో సూట్ ఫైల్ చేసిన వివేక్.. జనం ముందు ఆర్‌ఎస్ఎస్ ఇమేజ్‌ను చెడగొట్టడమే లక్ష్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇందుకుగాను జావెద్ రూ.1 జరిమానా కింద చెల్లించాలని కోరారు. కాగా జావేద్ అక్తర్ ‘తాలిబాన్ ఇస్లామిక్ కంట్రీ కావాలని అనుకుంటుంది. ఆర్ఎస్ఎస్ హిందూ జాతితో కూడిన ఇండియాను కోరుకుంటున్నాయి’ అని ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు హిందుత్వ ఆర్గనైజేషన్స్ ఆందోళనకు దిగాయి. జావెద్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

Tags:    

Similar News