టీజీజీడీఏ నూతన కార్యవర్గం ఎన్నిక చెల్లదు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) నూతన కార్యవర్గానికి చట్టబద్దత లేదని ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీజీడీఏ పేరిట గతంలో కొంత మంది వైద్యులు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదై విచారణలోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రవిశంకర్ అధ్యక్షుడుగా, డాక్టర్ షరీఫ్ సెక్రటరీ జనరల్‌గా ఇటీవల ఎన్నికలు […]

Update: 2020-08-08 10:45 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) నూతన కార్యవర్గానికి చట్టబద్దత లేదని ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీజీడీఏ పేరిట గతంలో కొంత మంది వైద్యులు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సిటీ సివిల్ కోర్టులో కేసు నమోదై విచారణలోనే ఉందన్నారు.

ఈ నేపథ్యంలో డాక్టర్ రవిశంకర్ అధ్యక్షుడుగా, డాక్టర్ షరీఫ్ సెక్రటరీ జనరల్‌గా ఇటీవల ఎన్నికలు జరిపి నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం న్యాయ స్ధానాన్ని దిక్కరించడమేనన్నారు. టీజీజీడీఏ కేంద్ర కమిటీ ఎన్నికకు ముందు జిల్లా కమిటీలు ఎంపిక చేయాలనేది యూనియన్ నిబంధనలలో స్పష్టంగా ఉందని, వీటిని పాటించకుండా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం నిబంధనలను అతిక్రమించమేనని డాక్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు . సంఘానికి అధ్యక్షునిగా తాను చేసిన ఆదేశాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని చెప్పారు.

Tags:    

Similar News