గురుకులం.. దరఖాస్తుదారులు ఎగ‘బడి’!
దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి ఏటా నిర్వహించే గురుకుల సెట్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుండటంతో గడువు తేదీని ఈ నెల 7 వరకు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్స్ 230, బీసీ సొసైటీలో 261, గిరిజన సొసైటీలో 77, విద్యాశాఖ సొసైటీలో 35 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 603 పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి 48,120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సొషల్ వెల్ఫేర్‌లో […]
దిశ, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి ఏటా నిర్వహించే గురుకుల సెట్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుండటంతో గడువు తేదీని ఈ నెల 7 వరకు పొడిగించారు.
రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్స్ 230, బీసీ సొసైటీలో 261, గిరిజన సొసైటీలో 77, విద్యాశాఖ సొసైటీలో 35 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 603 పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి 48,120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సొషల్ వెల్ఫేర్‌లో 18,400, గిరిజన సొసైటీలో 6080, బీసీ సొసైటీలో 20,800, విద్యాశాఖ జనరల్ సొసైటీలో 2840 సీట్లు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసింది. కానీ, విశేష స్పందన రావడంతో ఈ నెల 7 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. దరఖాస్తులను http://tgcet.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా రూ. 100 చెల్లించి, అభ్యర్థి ఫొటోతోపాటు సంబంధిత ధ్రువప్రతాలను జతపర్చాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు 33 జిల్లాల నుంచి 1,33,940 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 11,506, రంగారెడ్డిలో 7,563, సూర్యాపేటలో 6,292, ఖమ్మంలో 6,158, నిజామాబాద్‌లో 6030, సంగారెడ్డి జిల్లాలో 5,586 దరఖాస్తులు అందాయి. ఈ నెల 7 వరకు గడువు ఉండటంతో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.
గురుకులాల వైపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) విస్తృతంగా ప్రచారం చేస్తోంది. గ్రామాల్లో చాటింపు, కరపప్రతాల పంపిణీ, వాల్ పోస్టర్లు అంటించడం తదితర కార్యక్రమాల ద్వారా బస్తీలు, కాలనీల్లో ప్రచారం చేస్తున్నారు. సఫాయి కర్మచారుల పిల్లలకు ప్రత్యేక కోటా ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రత్యేకంగా జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. దీంతో కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిల్ కార్యాలయాల్లో గురుకులాల నోటిఫికేషన్‌పై ప్రచారం చేయించారు.
tags : tgcet, applications, date extended to 7th march