దిగుమతి సుంకాలపై టెస్లాతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా భారత్‌లో వాహనాల విక్రయాలకు సంబంధించి సంశయిస్తున్న ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దేశీయంగా తమ కంపెనీ ప్రణాళికపై కార్యచరణ వివరాలను వెల్లడించాలని ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. మొదటినుంచే టెస్లా కంపెనీ భారత్‌లో తక్కువ దిగుమతి సుంకాలకు అనుమతిస్తే తయారీ యూనిట్లను చేపడతామని చెప్తోంది. అయితే, మొదట్లో దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా భారత్‌లో వాహనాల విక్రయాలకు సంబంధించి సంశయిస్తున్న ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దేశీయంగా తమ కంపెనీ ప్రణాళికపై కార్యచరణ వివరాలను వెల్లడించాలని ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. మొదటినుంచే టెస్లా కంపెనీ భారత్‌లో తక్కువ దిగుమతి సుంకాలకు అనుమతిస్తే తయారీ యూనిట్లను చేపడతామని చెప్తోంది. అయితే, మొదట్లో దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల మొదటివారంలో టెస్లా కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కంపెనీ వివరణ తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భారత్‌లో టెస్లా కార్ల దిగుమతులపై పన్నులను తగ్గిస్తాం, అయితే స్థానిక యూనిట్ల సేకరణ, తయారీ యూనిట్ల గురించిన వివరాలను చెప్పాలని టెస్లా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారుల అడిగినట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
విదేశాల్లోనే అనుసంధానం చేసిన కార్లను దిగుమతి చేయడం కంటే పరికరాలను యూనిట్ల వారీగా దిగుమతి చేస్తే సుంకం తక్కువగా ఉంటుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తెలియజేసింది. ఈ అంశంపై కంపెనీ అభిప్రాయం ఏంటో చెప్పాలని ఆ శాఖ అధికారి కోరారు. అదేవిధంగా దిగుమతి సుంకాలను తగ్గించిన తర్వాత కంపెనీ కార్యాచరణ రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని అడిగారు. ఇదే సమయంలో దేశీయంగానే కార్ల తయారీ పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పినట్టు తెలిపారు. భరత్‌లో ఇప్పటివరకు సుమారు రూ. 750 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేశామని, సుంకాలను తగ్గిస్తే ఈ పెట్టుబడుల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని టెస్లా ప్రతినిధులు వివరించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో అమ్మకాలు, సేవలు, ఛార్జింగ్ వసతుల విభాగాల్లో ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెట్టనున్నట్టు వారు స్పష్టం చేశారు.