టెన్త్ విద్యార్థులు ఆల్ పాస్

దిశ, తెలంగాణ బ్యూరో: 10వ తరగతి విద్యార్థులందరిని పాస్ చేస్తున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్టుగా తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో 2020-21 ఏడాది 10వ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్నట్టుగా వివరించారు. ఇది వరకే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరిని పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేసినట్టుగానే 10వ తరగతి విద్యార్థులను కూడా పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేశారు. పాఠశాలలో […]

Update: 2021-05-11 10:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 10వ తరగతి విద్యార్థులందరిని పాస్ చేస్తున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్టుగా తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో 2020-21 ఏడాది 10వ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్నట్టుగా వివరించారు.

ఇది వరకే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరిని పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేసినట్టుగానే 10వ తరగతి విద్యార్థులను కూడా పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేశారు. పాఠశాలలో నిర్వహించే 20శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా గ్రేడింగ్‌లను కేటాయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 20శాతం మార్కులను 100శాతం మార్కులుగా పరిగణించి వాటి ఆధారంగా విద్యార్థుల ప్రతిభకు గ్రేడింగ్‌లు నమోదు చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News