అర్ధంకాని పాఠాలు.. మే 17 నుంచి టెన్త్ పరీక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో : 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు గండంగా మారాయి. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఆన్ లైన్ తరగతులకు హాజరైన విద్యార్థులు కేవలం 51 రోజులు మాత్రమే పాఠశాల్లో భౌతికంగా పాఠాలు విన్నారు. విద్యాసంస్థలు మళ్లీ బంద్ చేయడంతో టీశాట్ ద్వారా విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఆన్ లైన్ లో పాఠాలు అర్థంకాకపోవడంతో విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో మే 17నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఏ మేరకు ప్రతిభను కనుబర్చుతారనే […]
దిశ, తెలంగాణ బ్యూరో : 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు గండంగా మారాయి. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఆన్ లైన్ తరగతులకు హాజరైన విద్యార్థులు కేవలం 51 రోజులు మాత్రమే పాఠశాల్లో భౌతికంగా పాఠాలు విన్నారు. విద్యాసంస్థలు మళ్లీ బంద్ చేయడంతో టీశాట్ ద్వారా విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఆన్ లైన్ లో పాఠాలు అర్థంకాకపోవడంతో విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో మే 17నుంచి పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఏ మేరకు ప్రతిభను కనుబర్చుతారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
కరోనా ప్రభావంతో చదువుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆన్ లైన్ తరగతుల ద్వారా పాఠాలు వినడంతో విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఏ మేరకు పాఠాలు అర్థమయ్యాయే అంతుచిక్కడం లేదు. గతేడాది కూడా పరీక్షలు లేకుండా పై తగరతికి ప్రమోట్ కావడంతో విద్యార్థుల్లో పరీక్షల పట్ల సీరియెస్‌నెస్ పోయింది. 10వ తరగతి బోర్డ్ ఎక్జామ్‌లో ఎంత వరకు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారనేది ప్రశ్నార్థధమైంది.
మే 17 నుంచి 10వ తరగతి పరీక్షలు..
10వ తరగతి విద్యార్థులకు మే 13 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఇది వరకు ఒక్కో సబ్జెక్ట్ కు రెండు పేపర్లు ఉన్న విధానాన్ని 80 మార్కులతో ఒకే పేపర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరీక్షలకు మందుగా నిర్వహించే ఫార్మేటీవ్ అసెస్ మెంట్ పరీక్షలు విద్యాసంస్థల బంద్ తో నిర్వహించలేకపోతున్నారు. సిలబస్ పూర్తి స్థాయిలో పూర్తవకుండా ఫార్మేటీవ్ అసెస్ మెంట్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఎలాంటి ప్రతిభను కనుబరుస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆన్ లైన్‌లో అర్థంకాని పాఠాలు..
ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి 10వ తరగతి విద్యార్థులు ఆన్ లైన్‌లోనే పాఠాలను ఎక్కవగా విన్నారు. విద్యార్థులు భౌతికంగా పాఠాలు వినకపోవడం వలన ఆన్ లైన్ ద్వారా చాలా వరకు పాఠాలు బోధపడలేదు. కనీసం బేసిక్స్ కూడా నేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1నుంచి ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో భౌతికంగా పాఠశాలల్లో తరగతులు నిర్వహించారు. పాఠశాలకు హాజరైన విద్యార్థులను గమనించిన ఉపాధ్యాయులు అన్ని పాఠాలను మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టారు. పాఠాలను తగ్గించి బోధించినప్పటికీ 51 రోజుల్లో 30శాతం సిలబస్ ను మాత్రమే పూర్తి చేశారు.
విద్యాప్రమాణాలు కోల్పోయిన విద్యార్థులు..
ఆన్ లైన్ తరగతుల నిర్వహణ వలన చాలా వరకు విద్యార్థులు విద్యా ప్రమాణాలను కోల్పోయారు. గతేడాది పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ కావడంతో పరీక్షలపై విద్యార్థులు శ్రద్ధను కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలను సాధిస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాధి మరింత ప్రబలితే పరీక్షలు నిర్వహిస్తారా లేదానే సందేహాలు తలెత్తుతున్నాయి. 10వ తరగతి విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనుందని ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది.