క్రిష్టరాయన్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత
దిశ, నల్లగొండ: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమవుతున్న క్రిష్ట రాయన్ ప్రాజెక్టు పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూములకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడతారంటూ ఆందోళనకు దిగారు. ఆర్అండ్ఆర్‌లో సర్వే చేసి నష్టపరిహారం చెలిస్తామన్న ప్రభుత్వం, ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై కాంట్రాక్టర్‌ను నిర్వాసితులు నిలదీయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి పోలీసు స్టేషన్ వద్ద భూనిర్వాసితులకు బీజేపీ నాయకులు కర్నాటి శ్రీహరి, సింగారపు గిరి […]
దిశ, నల్లగొండ: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమవుతున్న క్రిష్ట రాయన్ ప్రాజెక్టు పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూములకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడతారంటూ ఆందోళనకు దిగారు. ఆర్అండ్ఆర్‌లో సర్వే చేసి నష్టపరిహారం చెలిస్తామన్న ప్రభుత్వం, ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై కాంట్రాక్టర్‌ను నిర్వాసితులు నిలదీయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి పోలీసు స్టేషన్ వద్ద భూనిర్వాసితులకు బీజేపీ నాయకులు కర్నాటి శ్రీహరి, సింగారపు గిరి ముదిరాజ్, శ్రీశైలం యాదవ్ మద్దతు పలికారు.