కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఇండిపెండెంట్ అభ్యర్థిని అడ్డుకోవడంతో లాఠీచార్జ్..
దిశ, డైనమిక్ బ్యూరో : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారం చివరి రోజు కావడంతో హీట్ పెరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు లేకుండా ఏకగ్రీవం పొందేందుకు కొందరు నాయకులు కలెక్టరేట్ల వద్ద మకాం వేశారు. ఈ సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చారు. దీంతో అది గమనించిన కొందరు నాయకులు సత్యనారాయణ చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలు చించేశారు. […]
దిశ, డైనమిక్ బ్యూరో : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారం చివరి రోజు కావడంతో హీట్ పెరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు లేకుండా ఏకగ్రీవం పొందేందుకు కొందరు నాయకులు కలెక్టరేట్ల వద్ద మకాం వేశారు.
ఈ సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చారు. దీంతో అది గమనించిన కొందరు నాయకులు సత్యనారాయణ చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలు చించేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంతం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.