బాసర ఆలయంలో లాక్‌డౌన్ పేరుతో అపచారం
దిశ,బాసర: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో లాక్‌డౌన్ పేరుతో అపచారం వెలుగుచూసింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ అధికారులు బాసర ఆలయాన్ని పది రోజులపాటు మూసివేశారు. భక్తులకు దర్శనానికి అనుమతి ఉండదని అమ్మవారి ఆలయంలో పూజలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఏకంగా బాసర అమ్మవారి గర్భగుడికే ఆలయాధికారులు తాళం వేశారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, […]
దిశ,బాసర: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో లాక్‌డౌన్ పేరుతో అపచారం వెలుగుచూసింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ అధికారులు బాసర ఆలయాన్ని పది రోజులపాటు మూసివేశారు. భక్తులకు దర్శనానికి అనుమతి ఉండదని అమ్మవారి ఆలయంలో పూజలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
అయితే ఏకంగా బాసర అమ్మవారి గర్భగుడికే ఆలయాధికారులు తాళం వేశారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, హారతి నిర్వహించిన అనంతరం లాక్ డౌన్ పేరిట ఆలయ గర్భగుడికి తాళం వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలయ అధికారుల ఓవరాక్షన్ పై అమ్మవారి భక్తులు మండిపడుతున్నారు. దీనిపై వివరణ కొరకు ‘దిశ’ ప్రతినిధి ఆలయ కార్యాలయానికి వెళ్లగా అక్కడ అధికారులు ఎవరూ లేరు. ఇదిలా ఉంటే అమ్మవారి ఆలయం మూసివేయడంతో మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు భక్తులు బయట నుండే దర్శనం చేసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయారు.